దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో తెరకెక్కి సంచలన విజయం అందుకున్న ‘దృశ్యం’ సిరీస్ సినిమాలలో భాగంగా మూడో సినిమా రానుంది. ఈ మేరకు నేడు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ జీతూ జోసెఫ్‌తో ఆయన ‘దృశ్యం 3’ ని ధృవీకరించారు. ‘దృశ్యం, దృశ్యం 2’ బ్లాక్ బస్టర్స్ తర్వాత, మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ మరోసారి చేతులు కలిపారు. దీంతో ఒక్కసారిగా ఈ మూవీపై ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మోహన్‌లాల్ తన ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించారు. ఒక స్పెషల్ పోస్ట్‌లో ఆయన డైరెక్టర్ జీతూ జోసెఫ్ మరియు నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్‌లతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. దీనికి “ది పాస్ట్ నెవర్ స్టేస్ సైలెంట్ దృశ్యం 3 ధృవీకరించబడింది! #దృశ్యం 3 (sic),” అనే క్యాప్షన్‌ను జోడించారు.
కాగా మలయాళ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ‘దృశ్యం’ ఒకటి. ఇది హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, సింహళీ మరియు చైనీస్‌లో కూడా రీమేక్ చేయబడింది. అన్ని భాషలలో ఈ సినిమా విజయవంతమైంది. మోహన్‌లాల్ నటించిన దృశ్యం 2013లో విడుదల కాగా, రెండో భాగం 2021లో వచ్చింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: