తమిళ స్టార్ హీరో తల అజిత్, మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇందులో అజిత్ ఈ త్రీ రోల్స్ లో కనిపించనున్నాడు.టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.తమిళం లో వారికి ఇదే మొదటి సినిమా. ఈసినిమాపై భారీ అంచానాలు వున్నాయి. అజిత్ నుండి ప్రాపర్ కమర్షియల్ సినిమా వచ్చి చాలా రోజులవుతుంది.ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ ఆ లోటు తీర్చనుంది. ఈసినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా కూడా బాగా వస్తుందని టాక్ వినపడుతుంది.ఇక ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కుదిరితే వచ్చే వారం లో టీజర్ వచ్చే ఛాన్స్ వుంది. ఇందులో అజిత్ కు జోడిగా త్రిష నటిస్తుండగా సునీల్ ,ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న విడుదలకానుంది.
ఇదిలావుంటే రీసెంట్ గా అజిత్ ,విడా ముయార్చి తో ప్రేక్షకులకుముందుకు రాగ ఈసినిమా కూడా తనకు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయింది.నిన్నటి వరకు ఈసినిమా 150కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.మగిజ్ తిరుమనేని డైరెక్ట్ చేయగా త్రిష కథానాయికగా నటించింది.లైకా ప్రొడక్షన్స్ ఈసినిమాను నిర్మించింది. తెలుగులో ఈసినిమా పట్టుదల అనే టైటిల్ తో విడుదలైయింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: