దేవర తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ తెలుగు సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు.ఈ కాంభినేషన్ పై భారీ అంచనాలు వున్నాయి. ఇక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రేపటి నుండి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.రామోజీ ఫిలిం సిటీ లో ఈ షెడ్యూల్ జరుగనుంది.దాదాపు 10 రోజులపాటు కొనసాగనుంది.ఇందులో ఎన్టీఆర్ లేకుండా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెకండ్ షెడ్యూల్ నుండి ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన లుక్ మార్చే పనిలో వున్నాడు.మార్చి లో రెండో షెడ్యూల్ జరుగనుంది. ఈసినిమా కోసం హీరోయిన్ గా కెజిఎఫ్ ఫేమ్ రుక్మిణి వసంత్ ను తీసుకోవాలనుకుంటున్నారట.రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.లాంచ్ రోజే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.వచ్చే ఏడాది జనవరి 9న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక ఎన్టీఆర్ ,వార్ 2 తో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు.యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.ఈఏడాది ఆగస్టు లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.ఇప్పటివరకు అయితే ఈసినిమా నుండి అధికారికంగా ఒక్క అప్డేట్ కూడా రాలేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: