టైటిల్ గ్లింప్స్ తోనే అంచనాలు పెంచేసిన మదరాసి

Sivakarthikeyan's Madharasi Title Glimpse Receives Amazing Response

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఇటీవలే ‘అమరన్’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్రధానపాత్రలో నటిస్తోన్న హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘మదరాసి’. క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ వండర్‌గా అద్భుత స్థాయిలో రూపొందుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్న శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా, ఈ మూవీ టైటిల్‌ని ‘మదరాసి’గా రివిల్ చేశారు మేకర్స్. దీనిని గమనిస్తే, శివకార్తికేయన్ పూర్తిగా పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. అలాగే ఈ యాక్షన్-ప్యాక్డ్ గ్లింప్స్‌ సినిమాలోని ఇతర కీలక పాత్రలను కూడా పరిచయం చేసింది. టైటిల్ గ్లింప్స్‌లో సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలామోన్ హై-క్లాస్ విజువల్స్ ఆకట్టుకున్నాయి.

ఇంకా రాక్‌స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ తన ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్‌తో విజువల్స్‌ను ఎలివేట్ చేశాడు. తన ఇంటన్సీవ్ నెరేటివ్ గ్రిప్పింగ్ స్టొరీ టెల్లింగ్ తో ఆకట్టుకునే ఎఆర్ మురుగదాస్ మదరాసితో సరికొత్త ఎక్సయిటింగ్ యాక్షన్-ప్యాక్డ్ కథను చూపించబోతున్నారని గ్లింప్స్ ప్రామిస్ చేస్తోంది. అయితే టైటిల్ రివీల్, గ్లింప్స్ ఈ హై-ప్రొఫైల్ ప్రాజెక్ట్ కోసం ఎక్సయిట్మెంట్ పెంచాయి.

కాగా మదరాసి చిత్రంలో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. కెవిన్ మాస్టర్, దిలీప్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీని పర్యవేక్షిస్తున్నారు.

ఇక శివ కార్తికేయన్ ప్రస్తుతం ఈ సినిమాతోపాటు తన 25వ సినిమా ‘పరాశక్తి’ లో కూడా నటిస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీని స్టార్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర రూపొందిస్తున్నారు. అథర్వ ,శ్రీలీల కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 1990 బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ హీరో జయం రవి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో పరాశక్తి విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.