కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఇటీవలే ‘అమరన్’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్‌తో చేతులు కలిపాడు. రీసెంట్‌గా శివకార్తికేయన్ జన్మదినం సందర్భంగా, మేకర్స్ ఈ మూవీ టైటిల్‌ని ‘మదరాసి’ గా రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ యాక్షన్-ప్యాక్డ్ టైటిల్ గ్లింప్స్ హై-క్లాస్ విజువల్స్‌తో ఆకట్టుకోగా.. శివకార్తికేయన్ పూర్తిగా పవర్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించి అలరించాడు. ఇదిలావుంటే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. మదరాసి చిత్రం ఓవర్సీస్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థ ఫార్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకుంది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
కాగా మదరాసి చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సుదీప్ సినిమాటోగ్రాఫీ అందిస్తుండగా.. రాక్‌స్టార్ అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నాడు.
అలాగే శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. కెవిన్ మాస్టర్, దిలీప్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీని పర్యవేక్షిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను విజువల్ వండర్‌గా అద్భుత స్థాయిలో నిర్మిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: