శివ కార్తికేయన్ మదరాసి గ్లింప్స్ రిలీజ్ 

Madharasi glimpse and first look out now

తమిళ హీరో శివ కార్తికేయన్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతందని తెలిసిందే. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇక ఈసినిమాకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఇచ్చింది చిత్ర బృందం.ఈరోజు శివ కార్తికేయన్ బర్త్ డే కావడంతో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను మరియు ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.ఈ సినిమాకు మదరాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.గ్లింప్స్ అయితే యాక్షన్ ప్యాక్డ్ గా కట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మురగదాస్ గజిని ,తుపాకి సినిమాలను గుర్తు చేసింది.ఇందులో హీరోకి ఏదో డిజార్డర్ ఉన్నట్లు గా హింట్ ఇచ్చారు.అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ లో శివ కార్తికేయన్ ఇంటెన్స్ లుక్ తో ముఖానికి ఓ వైపు బ్లడ్ తో కనిపించాడు.ఓవరాల్ గా మదరాసి,మురగదాస్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.లక్ష్మి మూవీస్ నిర్మిస్తుంది.తమిళంతోపాటు తెలుగు ,కన్నడ ,మలయాళ ,హిందీ భాషల్లో విడుదలకానుంది.మే లో ఈసినిమాను థియేటర్లలోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక శివ కార్తికేయన్ ప్రస్తుతం ఈ సినిమాతోపాటు తన 25వ సినిమా పరాశక్తి లో కూడా నటిస్తున్నాడు.రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ ,శ్రీలీల కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రముఖ హీరో జయం రవి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఈసినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇


తెలుగు
తమిళ్కన్నడమలయాళండబ్ద్ ఫిలిమ్స్

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.