తమిళ హీరో శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఈసినిమాకు పరాశక్తి అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.టైటిల్ తోపాటు చిన్న టీజర్ ను కూడా వదిలారు.ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.ఇందులో శివ కార్తికేయన్ తోపాటు అథర్వ ,శ్రీలీల,రవి మోహన్ లను పరిచయం చేశారు.వీరి గెటప్స్ చూస్తుంటే 1990 బ్యాక్ డ్రాప్ తో పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది ఈసినిమా.ఇందులో జయం రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.టీజర్ చివర్లో హీరో శివ కార్తికేయన్ ను రివీల్ చేశారు.తెలుగులో శివ కార్తికేయన్ సొంత డబ్బింగ్ చెప్పుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ అయితే టైటిల్ టీజర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్.ఇక నిజానికి ఈసినిమా సూర్య హీరోగా నజ్రియా , దుల్కర్ సల్మాన్ తో చేద్దామనుకున్నారు కానీ కుదరలేదు. దాంతో సూర్య ప్లేస్ లో శివ కార్తికేయన్ ను మిగితా పాత్రలకు అథర్వ ,శ్రీలీల ,రవి మోహన్ లను తీసుకున్నారు.ఈసినిమాతో శ్రీ లీల తమిళంలోకి ఎంట్రీ ఇస్తుంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.
ఇక గత ఏడాది దీపావళికి అమరన్ తో వచ్చి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు తమిళ హీరో శివ కార్తికేయన్.ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.తెలుగులో కూడా దాదాపు 40కోట్ల వసూళ్లతో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఈసినిమా తరువాత శివ కార్తికేయన్ 24వ సినిమాతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.మురగదాస్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























