టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే ‘క’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దిల్‌రూబా’. కాగా ఇది కిరణ్ అబ్బవరం నటిస్తోన్న 10వ చిత్రం కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో నటి నజియా డేవిసన్ కీలక పాత్రలో కనిపించనుంది. విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 14న దిల్ రుబా రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగా ఇప్పటికే దిల్‌రూబా టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో ముందుకొచ్చింది చిత్ర యూనిట్. త్వరలో ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్టు తెలిపింది.
‘హే జింగ్లీ’ అంటూ సాగే ఈ సాంగ్ ఈనెల 18న సాయంత్రం 5:01 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను Yoodlee ఫిల్మ్స్ మరియు శివం సెల్యులాయిడ్స్ బ్యానర్స్‌పై రవి, జోజో జొస్ భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. ‘క’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: