గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబి కొల్లి (కె.ఎస్ రవీంద్ర) రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఆయనకు వరుసగా నాలుగో 100 కోట్ల మూవీగా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ఈ సినిమా హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. ఈ క్రమంలో డాకు మహారాజ్ ఫిబ్రవరి 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో.. ” ‘అనగనగా ఒక రాజు.. చెడ్డవాళ్ళు అందరూ డాకు అనేవాళ్లు.. కానీ మాకు మాత్రం మహారాజు’ అనే క్యాప్షన్ తో విషయాన్ని వెల్లడించింది. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషలలో సినిమా స్ట్రీమింగ్ కానుంది.
డాకు మహారాజ్ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేయగా.. ఊర్వశి రౌతేలా కీలక పాత్రల్లో కనిపించింది. అలాగే ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించాడు. తమన్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
డాకు మహారాజ్ కథ ఏంటంటే..?
కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్) విద్యావేత్త. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఓ పెద్ద పాఠశాలను నడుపుతుంటాడు. ఆయనకు ఒక పెద్ద కాఫీ ఎస్టేట్ వుంటుంది. స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవి కిషన్) దీనిని లీజుకి తీసుకుని అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటాడు. వన్యమృగాలని అక్రమంగా తరలిస్తుంటాడు. ఈ క్రమంలో త్రిమూర్తులు అరాచకాలు హద్దుమీరడంతో పోలీసులని ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి.
దీంతో కృష్ణమూర్తిపై పగతో రగిలిపోతాడు త్రిమూర్తులు. ఆయన మనవరాలు వైష్ణవిని చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఆ ఇంట్లో పని చేస్తున్న మకరంద్ దేశపాండే సలహాపై చంబల్ లోని మహారాజ్ (బాలకృష్ణ) అనే మోస్ట్ వాంటెడ్ కు కబురుపెడతాడు కృష్ణమూర్తి.
ఈ నేపథ్యంలో మహారాజ్ పాప ప్రాణాలు కాపాడటానికి నానాజీగా పేరు మార్చుకొని డ్రైవర్ గా చేరుతాడు. అయితే అసలు ఈ మహారాజ్ ఎవరు? ఆ పాపకి అతనికి సంబంధం ఏమిటి? మరోవైపు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించే బల్వంత్ ఠాకూర్ (బాబీ డియోల్) నందిని (శ్రద్ధా శ్రీనాథ్) ఎవరు? మహారాజ్ పేరు మార్చుకొని రావాల్సిన అవసరం ఏమిటి? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: