తండేల్ ఫస్ట్ వీకెండ్ లో అదరగొట్టగా ఆ తరువాత వర్కింగ్ డేస్ లో కొంచెం నెమ్మదించింది.ఇక నిన్నటి నుండి మళ్ళీ పుంజుకొని సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 95.20కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.నిన్న కొత్త సినిమాలు వచ్చినా వాటి వల్ల ఎలాంటి నష్టం కలుగలేదు.ఈరోజుతో తండేల్ 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.ఈరోజు ,రేపు ఇదే జోరు కొనసాగించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగ చైతన్య తన కెరీర్ లో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానున్నాడు.అటు నార్త్ అమెరికాలోనూ ఈసినిమా 1 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడం తో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.ఇప్పట్లో పెద్ద సినిమాలు లేకపోవడం తండేల్ కు అడ్వాంటేజ్ కానుంది. ఇక విడుదలకు ముందు ఈసినిమా పాటలు ఓ ఊపు ఊపాయి.బుజ్జి తల్లి సాంగ్ నిన్నటి తో యూట్యూబ్ లో 100మిలియన్ల వ్యూస్ ను దాటేసింది .సాంగ్స్ తోనే సినిమాకు భారీ హైప్ వచ్చింది.
చందు మొండేటి తెరకెక్కించిన ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.గీతా ఆర్ట్స్ ఈసినిమాను నిర్మించింది.ఇక వరుస పరాజయాల తరువాత నాగ చైతన్య ఈసినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: