పుష్ప 2 తరువాత సరైన సినిమాలు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయింది.అయితే నిన్న విడుదలైన చావా తో మళ్ళీ థియేటర్లలో సందడి నెలకొంది. తొలి రోజు ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.పాజిటివ్ రివ్యూస్ తోపాటు మాత్ టాక్ కూడా బాగుండడంతో మొదటి రోజు ఇండియాలో 33.10కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.కేవలం హిందీ లోనే విడుదలైన ఈసినిమా సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుని విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఇక ఈరోజు రాంపేజ్ బుకింగ్స్ అవుతున్నాయి.దాంతో మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.రేపటి తో ఈసినిమా 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప 2 హిందీ వెర్షన్ బాలీవడ్ లో చరిత్ర సృష్టించింది.ఏకంగా 820కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.మరి చావా ఈసినిమా కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి.
ఛత్రపతి శంభాజీ బయోపిక్ గా వచ్చిన ఈసినిమాలో శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటించగా రష్మిక మందన్న హీరోయిన్ గా చేసింది.లక్ష్మణ్ ఉఠేకర్ డైరెక్ట్ చేశాడు.ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా యష్ రాజ్ ఫిలిమ్స్ ,పెన్ స్టూడియోస్ నిర్మించాయి.
ఇక ఈసినిమాతో రష్మిక మందన్న హిందీలో రెండో విజయాన్ని అందుకుంది.యానిమల్ తో మొదటి విజయాన్ని అందుకోగా ఇప్పుడు చావా తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.నెక్స్ట్ రష్మిక, సల్మాన్ ఖాన్ సికిందర్ లో కనిపించనుంది.మరి ఈసినిమాతో హ్యాట్రిక్ కొడుతుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: