మెగాస్టార్ చిరంజీవి -బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో జరుగుతుంది.ఇందులో చిరు ఇంట్రో సాంగ్ ను షూట్ చేస్తున్నారు.ఈ మాస్ సాంగ్ నుండి చిత్ర బృందం ఓ స్టిల్ ను విడుదలచేసింది.ఇందులో చిరు స్టైలిష్ గా కనిపించాడు.ఈపాటకు శోభి కొరియోగ్రఫీ చేస్తున్నాడు.ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తయినట్లే. ఇందులో సప్రైజ్ క్యామియో లు కూడా వుండనున్నాయని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రీయేషన్స్ నిర్మిస్తుంది.మే 9న థియేటర్లలోకి తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈసినిమా తరువాత చిరంజీవి మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అందులో భాగంగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తో ఓ సినిమా చేయనున్నాడు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనెర్ గా రానుంది.దీనితో పాటు చిరు ,అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటించడానికి ఓకే చెప్పాడు.చిరు ఫస్ట్ ఈసినిమాను స్టార్ట్ చేయనున్నాడు.సమ్మర్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.త్వరలోనే ఈసినిమా లాంచ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























