నాగ చైతన్య తండేల్ నిన్నటితో మొదటి వారం రన్ ను పూర్తి చేసుకుంది.ఇక 7 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 90.12కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకోగా ఆ తరువాత వర్కింగ్ డేస్ లో కొంచెం నెమ్మదించింది.ఈరోజు నుండి మళ్ళీ పుంజుకోనుంది.బుక్ మై షోలో ఈసినిమాకు ఇప్పటివరకు 1 మిలియన్ కు పైగా టికెట్లు తెగాయి.రేపటి తో తండేల్ 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాంతో అక్కినేని హీరోల్లో నాగ చైతన్య మొదటి సారి ఈ ఫీట్ సాదించనున్నాడు.అటు నార్త్ అమెరికాలోనూ ఈసినిమా స్టడీ గా కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. నిన్నటి తో అక్కడ 800 K డాలర్ మార్క్ ను దాటేసింది.ఈవారంలో మిలియన్ క్లబ్ లో చేరనుంది.ఇప్పటికే ఈసినిమా దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది.మరి ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో లాభాలను తీసుకొస్తుందో చూడాలి.
వాస్తవిక సంఘటనల ఆధారంగా చందు మొండేటి తెరకెక్కించిన ఈసినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడి గా కనిపించగా తనకు జోడిగా సాయి పల్లవి నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమాలో చైతన్య ,సాయి పల్లవి నటన ,దేవి సంగీతం హైలైట్ అయ్యాయి.గీతా ఆర్ట్స్ ఈసినిమాను నిర్మించింది.ఇక వరుస పరాజయాల తరువాత నాగ చైతన్య ఈసినిమా తో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: