స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం న్యూ జనరేషన్ లవ్ స్టొరీ ‘తెలుసు కదా’లో నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు, ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుసు కదా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా, మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రాశి ఖన్నా సిద్ధు బుగ్గపై ముద్దు పెడుతూ చిరునవ్వులో కనిపిస్తుండగా, శ్రీనిధి శెట్టి అతని ముందు నిలబడి ఉండటం.. ఒక పర్ఫెక్ట్ వాలెంటైన్స్ డే పోస్టర్ ని ప్రజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్ చాలా బ్యూటీఫుల్ గా ఉంది. కథలోని ఈ మూడు పాత్రల మధ్య బాండింగ్ గురించి ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పని చేస్తున్నారు. శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: