రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ షూటింగ్ షురూ

Roshan Kanakala's Mowgli 2025 Shoot Begins, Special Video Released

తన తొలి చిత్రం ‘కలర్ ఫోటో’తో జాతీయ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ డైరెక్టర్ సందీప్ రాజ్, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మోగ్లీ 2025 తో మరో ఎమోషనల్ పవర్ ఫుల్ నెరేటివ్ ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. తన తొలి చిత్రం బబుల్‌గమ్‌లో ఇంటెన్స్ యాక్షన్ కు ప్రశంసలు అందుకున్న రోషన్ కనకాల తన వెర్సటాలిటీ ప్రజెంట్ చేసే పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న మోగ్లీ 2025 అద్భుతమైన ఫారెస్ట్ నేపథ్యంలో జరిగే సమకాలీన ప్రేమకథ. సాక్షి సాగర్ మడోల్కర్‌ను కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. అదే విషయాన్ని ఆసక్తికరమైన గన్ మేకింగ్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.

అడవిలోని ప్రశాంతమైన డెప్త్స్ లో దర్శకుడు సందీప్ రాజ్ ఒక టెంట్ లోపల కూర్చుని, జాగ్రత్తగా తుపాకీని సిద్ధం చేస్తున్నాడు. అన్నీ సరిగ్గా అమర్చిన తర్వాత, అతను దానిని సాక్షికి అప్పగిస్తాడు, ఆమె సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. రోషన్ అడుగుపెట్టి ఆమెతో కలిసి తమ లక్ష్యాన్ని గురి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా సీన్ మారుతుంది. వారు కలిసి చేతులను స్థిరంగా ఉంచుకుంటూ, కాల్పులు జరుపుతారు.

షాట్ మోగుతుండగా, స్క్రీన్ లో అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు అని రావడం చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. వీడియో ఎనర్జీతో ప్రారంభమవుతుంది, థ్రిల్లింగ్ ఎడ్వంచర్ ఫీలింగ్, లోతైన ప్రేమ అంతర్లీన భావనతో టోన్ ని సెట్ చేస్తుంది. తుపాకీ తయారీ క్రమం సినిమా విస్తృత కథాంశంతో ముడిపడి ఉన్న లేయర్ ని యాడ్ చేసింది.

నిర్మాత విశ్వ ప్రసాద్, దర్శకుడు సందీప్ రాజ్ ఈ వీడియోకు ఫ్రెష్, డైనమిక్ ఎనర్జీ జోడించారు, ఉత్తేజకరమైన, మోడరన్ సినిమా అనుభవాన్ని హామీ ఇస్తున్నారు. రోషన్ ఆకట్టుకునే ప్రజెన్స్ కట్టిపదేసింది. కాల భైరవ ఉత్తేజకరమైన నేపథ్య సంగీతం విజువల్స్ ఇంటన్సిటీని పెంచుతుంది.

ప్రతిభావంతులైన తారాగణం, సాంకేతిక బృందంతో చిత్రీకరణ ప్రారంభించిన మోగ్లీ 2025 సినీ ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. స్క్రిప్ట్ రాయడానికి ఎనిమిది నెలలు, ప్రీ-ప్రొడక్షన్ దశకు ఏడు నెలలు పట్టిందని మేకర్స్ షేర్ చేశారు. వారు ఆరుగురు వినూత్న సాంకేతిక నిపుణులను కూడా పరిచయం చేశారు.

ఈ చిత్రానికి రామ మారుతి. ఎం. సినిమాటోగ్రఫీ, కాల భైరవ సంగీతం, కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్, కిరణ్ మామిడి ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను పర్యవేక్షిస్తున్నారు. నటరాజ్ మాదిగొండ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. రామ మారుతి ఎం. రాధాకృష్ణ రెడ్డి సహ రచయితలుగా ఉన్నారు. కాగా మోగ్లీ 2025 ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.