సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Oh Bhama Ayyo Rama Valentine’s Day Special Poster Unveils From Suhas Film

యువ కథానాయకుడు సుహాస్ తన విభిన్నమైన స్టొరీ సెలక్షన్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ, మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది. అనితా హస్సానందని, అలీ, బబ్లూ పృథ్వీ రాజ్, రవీందర్ విజయ్, మొయిన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాను రామ్ గోధల తన తొలి ప్రయత్నంగా దర్శకత్వం చేస్తున్నారు. హరీష్ నల్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ ఓ అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సుహాస్, మాళవిక మనోజ్‌ల రొమాన్స్‌ను చూపిస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఈ జంట అందించే ప్రేమకథ భావోద్వేగాలను రేకెత్తించేలా ఉండబోతోందని అర్థమవుతోంది.

అంతేకాకుండా, కథలో మరిన్ని అంశాలను అందించేందుకు సీనియర్ నటి అనితా హసనందిని మరియు ప్రముఖ నటుడు అలి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పనిచేస్తోంది. మణికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ సంగీతాన్ని అందిస్తున్నారు. భవిన్ షా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ను సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.