కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ధనరాజ్ సినిమాల్లో కంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత హీరోగా మారి పలు సినిమాలు కూడా చేశాడు. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు తానే దర్శకుడిగా మారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం కథాంశంగా ‘రామం రాఘవం’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా విడుదల చేసిన గ్లింప్స్ అయితే ఫీల్ గుడ్‌తో ఆకట్టుకుంది. అలాగే ఇప్పటికే రిలీజ్ చేసిన ఇతర ప్రచార చిత్రాలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం షూటింగ్‌ను ముగించుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ను ప్రారంభించేసారు. దీనిలో భాగంగా తాజాగా ఓ కీలక అప్డేట్ అందించారు. ఈనెల 14న రామం రాఘవం ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. దీనిని నేచురల్ స్టార్ నాని చేతులమీదుగా నిర్వహించనున్నారు.ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో హరీశ్ ఉత్తమన్, మోక్ష, శ్రీనివాస రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు శివప్రసాద్ యానాల కథ అందిస్తున్నాడు. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నాడు. కాగా ఫిబ్రవరి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: