మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే కల్ట్ సినిమా నిలిచింది నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్.కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ వున్నారు.ఇక ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈసినిమా రీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇక ఎట్టకేలకు ఈసినిమా రీ రీలీజ్ కానుంది. ఈనెల 22 న నా ఆటోగ్రాఫ్ మళ్ళీ థియేటర్లలోకి రానుంది.మరి ఈ సారి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.రవితేజ ఈసినిమాలో హీరోగా నటించగా గోపాల్ రెడ్డి తెరకెక్కించారు.ఓ తమిళ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈసినిమాలో గోపికా ,భూమిక ,సునీల్ కీలక పాత్రల్లో నటించారు.ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించగా బెల్లంకొండ సురేష్ నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు.రవితేజకు ఇది 75వ సినిమా.భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇందులో రవితేజ ఆర్ పి ఎఫ్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమా పై మంచి అంచనాలు వున్నాయి.మే 9న ఈసినిమా థియేటర్లోకి రానుంది.
రవితేజ కు ఈసినిమా విజయం తప్పనిసరి కానుంది.చివరగా తను మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకుల ముందుకు రాగ ఈసినిమా నిరాశపరిచింది. దాంతో ఈసారి సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: