ఫస్ట్ వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన నాగ చైతన్య తండేల్ వర్కింగ్ డే లో కూడా అదరగొట్టింది. నాలుగో రోజు బుక్ మై షో లో ఈసినిమాకు 72 వేలకుపైగా టికెట్లు తెగాయి. దాంతో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించి మంచి వసూళ్లను దక్కించుకుంది.ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో ఈసినిమా 73.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ప్రస్తుతం వేరే సినిమాల నుండి పోటీలేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.ఈ వారంలో తండేల్ 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది. దాంతో నాగ చైతన్య కెరీర్ లో మొదటి సారి ఈ ఫీట్ సాదించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు నార్త్ అమెరికాలోనూ ఈసినిమా స్టడీ గా కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. నిన్నటి తో అక్కడ 750 K డాలర్ మార్క్ ను దాటేసింది. ఈవారంలో మిలియన్ క్లబ్ లో చేరనుంది.ఇక ఈసినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఈరోజు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. దీనికి కింగ్ నాగార్జున చీఫ్ గెస్ట్ గాహాజరయ్యారు.
వాస్తవిక సంఘటనల ఆధారంగా చందు మొండేటి తెరకెక్కించిన ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. నాగ చైతన్య , సాయి పల్లవి నటన , దేవి సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.గీతా ఆర్ట్స్ ఈసినిమాను నిర్మించింది.ఇక ఈసినిమా తో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు నాగ చైతన్య.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: