నటుడి కామెంట్స్ ఎఫెక్ట్.. స్పందించిన లైలా టీమ్

Laila Team Clarifies Over Actor Prudhvi Raj's Comments

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’. ఫిబ్రవరి 14న ప్రేక్షకులముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే నటుడి కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించాయి. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ లైలా చిత్రాన్ని బ్యాన్ చేయాలని ఒక వర్గంవారు సోషల్ మీడియాలో పిలునిస్తున్నారు. అలాగే ఈ సినిమా పైరసీ ప్రింట్‌ని రిలీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లైలా టీమ్ స్పందించింది.

ఈ మేరకు లైలా చిత్ర నిర్మాత సాహూ గారపాటి, హీరో విశ్వక్ సేన్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత సాహూ గారపాటి మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో ‘బాయ్ కాట్ లైలా’ అనే హ్యాష్ ట్యాగ్ చూసి షాక్ అయ్యాను. నటుడు పృథ్వీ కామెంట్స్ చేసిన సమయంలో మేము అక్కడ లేము. మెగాస్టార్ చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడం కోసం బయట వెయిట్ చేస్తున్నాం. అయినా జరిగిన పొరపాటుకు మేము అందరికి క్షమాపణలు తెలుపుతున్నాం” అని అన్నారు.

ఇక హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఆవేదన వెలిబుచ్చారు. విశ్వక్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “ఇప్పటి వరకూ సినిమా ప్రమోషన్స్ చాలా పాజిటివ్‌గా జరిగింది. టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వేరే చిత్రాల షూటింగ్స్‌కు కొన్ని రోజులు బ్రేక్‌ ఇచ్చి ఈ సినిమా ప్రమోషన్స్‌పైనే దృష్టి పెట్టాను. ఎందుకంటే ఇది నాకెంతో స్పెషల్. ఇందులోని లేడీ గెటప్పు కోసం మానసికంగా హార్డ్ వర్క్ చేశాను. ఫిబ్రవరి 14న ఉదయమే ‘లైలా’ హెచ్‌డీ ప్రింట్‌ లింక్‌ పెడతామంటూ సోషల్‌ మీడియాలో బెదిరిస్తున్నారు.”

“వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. బాయ్‌కాట్‌ లైలా అంటూ 25 వేల ట్వీట్లు వేశారు. నేనెందుకు బలి కావాలి సర్‌? 100మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనం ఎలిమినేట్‌ చేసేద్దామా? సినిమా వాళ్లం కదా.. ఈజీ టార్గెట్‌ అయిపోతామా? అని అనిపిస్తోంది. ఆ కామెంట్స్‌ చేసిన వ్యక్తి అనుభవమంత ఉండదు నా వయసు. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నేను, ప్రొడ్యూసర్‌.. చిరంజీవి గారిని ఆహ్వానించడానికి వెళ్లాం.”

“ఆయన ఏం మాట్లాడాడో ఇంటికి తిరిగి వెళ్లేంత వరకూ మాకు తెలియదు. సినిమాలో మేం అలాంటి సన్నివేశం పెట్టలేదు. ఆయన మాట్లాడిన దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన మీద కోపం మా సినిమాపై చూపించడం న్యాయమా? సినిమా కోసం చాలా కష్టపడ్డాం. సినిమా విడుదలకాక ముందే చంపేయకండి. ఈవెంట్ లో ఎవరు ఏం మాట్లాడతారో మా కంట్రోల్ లో వుండదు. మా ఎదురుగా ఇది జరిగుంటే అప్పుడే మైక్ తీసుకునేవాళ్ళం.”

“నాకు సినిమా రిలీజ్ ముఖ్యం. నా సినిమా రిలీజ్ అయ్యేవరకు సపోర్ట్ చేయండని కోరుతున్నాను.మా కంట్రోల్ లో లేకుండా ఒక వ్యక్తి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది మా కైండ్ రిక్వెస్ట్. ఇది మా సినిమా ఈవెంట్ లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన కేవలం సినిమాలో నటించాడు. సారీ చెబితేనే కూల్ డౌన్ అవుతారని భావిస్తే నేను క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి సినిమాని మాత్రం చంపకండి. ప్లీజ్ సపోర్ట్ లైలా” అని కోరారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.