జనవరిలో మేము కొట్టాం.. ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు

Producer Dil Raju Extends Best Wishes To Thandel Unit

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా హాజరవగా.. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఇక ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మంచి కథ. ఆ కథని ప్రేక్షకులు దగ్గరికి తీసుకెళ్ళే దర్శకుడు చందు. మంచి టీం. బన్నీ వాసు మంచి నిర్మాత. ఆయన వెనుక అరవింద్ గారి సపోర్ట్ ఉంది. సాయి పల్లవి ఎక్కడ ఉంటే, అక్కడ పాజిటివ్ ఎనర్జీ. చైతన్య కథని క్యారెక్టర్ ని పట్టుకొని కష్టపడ్డారు. ఇంతమంది కష్టపడిన తర్వాత సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. జనవరిలో మేము కొట్టాం. ఫిబ్రవరి లో మీరు కొడుతున్నారు. ఆల్ ది బెస్ట్ హోల్ టీం” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.