లవ్ స్టోరి తరువాత నాగ చైతన్య ,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. టాలీవుడ్ నుండి మంచి హైప్ తో ఫిబ్రవరి లో లో వస్తున్న మొదటి సినిమా ఇదే. సాంగ్స్ సూపర్ హిట్ కావడం తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఇక నిన్న ట్రైలర్ కూడా వదిలారు.లవ్ ,ఎమోషన్, దేశభక్తి మిక్స్ చేసి ట్రైలర్ ను కట్ చేశారు.లీడ్ పెయిర్ కెమిస్ట్రీ,దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.ఇక ఈ ట్రైలర్ కు యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఇప్పటివరకు యూట్యూబ్ లో 8 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ప్రస్తుతం మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఓవరాల్ గా ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచడంలో తండేల్ టీం సక్సెస్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయనున్నారు.ఈసినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. సోలోగా రిలీజ్ అవ్వడం అడ్వాంటేజ్ కానుంది.హిట్ టాక్ వస్తే 100 కోట్ల మార్క్ ను ఈజీగా దాటనుంది.ఈసినిమా తనకు కం బ్యాక్ అవుతందని నాగ చైతన్య చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.
శ్రీకాకుళంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈసినిమాలో చైతన్య బోటు డ్రైవర్ గా కనిపించనున్నాడు.భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ ఈసినిమాను నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి 7 న తండేల్ తెలుగుతోపాటు తమిళ ,హిందీ భాషల్లో థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: