యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తండేల్’. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 7న తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలోకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ‘రాక్‌స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన మూడు పాటలు చార్ట్ బస్టర్ అనిపించుకున్నాయి. ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సూపర్ హిట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన సెకండ్ సింగిల్ ‘నమో నమః శివాయ’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే రీసెంట్‌గా విడుదల చేసిన మూడో పాట హైలెస్సో హైలెస్సా కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ ముమ్మురం చేశారు మేకర్స్. దీనిలో భాగంగా మూవీ లవర్స్, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తండేల్ థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా లాంచ్ చేశారు. ఈ మేరకు ఈరోజు వైజాగ్ రామ టాకీస్ రోడ్ లోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్ వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ అయితే ఫుల్ ఇంటెన్సిటీతో సాగి మూవీపై ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌తో అంచనాలు పెంచేసింది.
యూఎస్ఏ లో ఈ సినిమా 596కుపైగా లొకేషన్లలో విడుదలకానుంది. చైతన్య కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ రిలీజ్. ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. సోలోగా రిలీజ్ అవ్వడం తండేల్‌కు మంచి అడ్వాంటేజ్ కానుంది. తండేల్ సినిమా నాగ చైతన్య కెరీర్‌లో నెవెర్ బిఫోర్ ఓపెనింగ్స్‌ను రాబట్టుకోనుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. హిట్ టాక్ వస్తే 100 కోట్ల మార్క్‌ను ఈజీగా దాటే అవకాశం ఉంది. మరి ఈ సినిమా నాగ చైతన్యకు ఎలాంటి రిజల్ట్‌ను ఇస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి.
ఇక తండేల్ మూవీకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. అలాగే షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా.. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందుతోంది. చైతూ తన కెరీర్‌లో తొలిసారి లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్ పోషిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: