సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది సంక్రాంతికి వస్తున్నాం.నిన్నటి తో మూడో వారం లోకి ఎంట్రీ ఇచ్చింది . తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా నిన్నటి వరకు 200 కోట్లకుపైగా రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈసినిమా నార్త్ అమెరికా లోనూ మంచి వసూళ్లను దక్కించుకుంటుంది.నిన్నటి వరకు 2.8మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.ఫుల్ రన్ లో 3 మిలియన్ క్లబ్ లో చేరనుంది.ఇప్పటికే అక్కడ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా 15 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా 285కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి డబుల్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఫుల్ రన్ లో 300కోట్ల మార్క్ ను చేరుకోనుంది. దాంతో సీనియర్ హీరోల్లో ఈ ఫీట్ సాధించిన మొదటి హీరోగా వెంకటేష్ రికార్డు సృష్టించనున్నారు.అంతేకాదు ఈసినిమా అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన రీజినల్ మూవీ గా రికార్డు సృష్టించింది.అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా ఐశ్వర్య రాజేష్ ,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా దిల్ రాజు ,శిరీష్ ఈసినిమాను నిర్మించారు.
ఈసినిమా తో అనిల్ రావిపూడి వరుసగా 8వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇక అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చూస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు వున్నాయి.ప్రస్తుతం చర్చల దశలో వున్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే క్లారిటీ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: