VT15 షూటింగ్‌ మొదలయ్యేది అప్పుడే

VT15 Team in Vietnam For Pre-production Progressing

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలికాలంలో ఆయన నటించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడటంలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు వరుణ్ తేజ్. దీంతో తన తదుపరి సినిమాను డిఫరెంట్ జానర్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా, కొత్త మూవీ #VT15కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా విడుదల చేసిన పోర్టర్ ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో రానుంది. హ్యూమరస్ అండ్ అడ్వంచరస్ చిత్రాలను రూపొందించడంలో పేరుపొందిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. “When haunting turns hilarious!! అనే ట్యాగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది.

కాగా VT15 వర్కింగ్ టైటిల్‌తో వరుణ్ తేజ్ 15 సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం వియత్నాంలో శరవేగంగా జరుగుతోంది. హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ‌తో పాటు నిర్మాతలు వియత్నాంలో అద్భుతమైన లొకేషన్స్‌ను చూస్తున్నారు. అలాగే స్క్రిప్ట్ వర్క్ కూడా వేగంగా జరుగుతోంది.

అన్ని కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక వరుణ్ తేజ్‌తో చేయబోతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ యూనిక్ స్టోరీలైన్‌ను డిజైన్ చేశారు. సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రం కోసం గాంధీ థ్రిల్స్, హ్యుమర్ బ్లెండ్ చేస్తూ అద్భుతమైన స్క్రిప్ట్‌ను రాసినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ, యూవీ క్రియేషన్స్‌తో ఇది వరుణ్ తేజ్ ఫస్ట్ కొలాబరేషన్. అలాగే తొలి ప్రేమ భారీ విజయం తర్వాత, వరుణ్ తేజ్ మరోసారి సెన్సేషనల్, బ్లాక్‌బస్టర్ సంగీత దర్శకుడు ఎస్. థమన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు. గతంలో ఆయన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విమర్శకుల ప్రశంసలు పొందిన ‘కంచె’ సినిమా చేశారు. మేర్లపాక గాంధీ గతంలో UV క్రియేషన్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ హిట్ ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాన్ని తీశారు. కాగా ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులు, మిగిలిన సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలును మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.