టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ టైటిల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇక సినిమా విడుదలకు ముందే రిలీజైన టీజర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే అలరించింది. గత కొంతకాలంగా తన పంథా మార్చి సీరియస్ టైప్ క్యారెక్టర్స్ పోషిస్తున్న అల్లరి నరేష్ మరోసారి ఇదే పంథాలో నటించి మెప్పించారు.
ఈ క్రమంలో థియేటర్లలో ఆడియెన్స్‌కి థ్రిల్ పంచిన ఈ మూవీ తాజాగా ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. కాగా రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్ సరసన అమృత అయ్యర్ కథానాయికగా కనిపించగా.. రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
‘మానాడు, రంగం, మట్టి కుస్తి’ వంటి చిత్రాలకు పని చేసిన రిచర్డ్ ఎమ్ నాథన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. కథ, సంభాషణలను దర్శకుడు సుబ్బు మంగదేవి స్వయంగా రాయగా.. స్క్రీన్‌ప్లేను విప్పర్తి మధు రాశారు. అలాగే విశ్వనేత్ర అడిషినల్ స్క్రీన్‌ప్లే సహకారాన్ని అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: