మచ్ అవైటెడ్ గేమ్ ఛేంజర్ మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. 6ఏళ్ళ తరువాత రామ్ చరణ్ నుండి సోలో గా వస్తున్న సినిమా ఇదే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.దాదాపు మూడేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకుంది. ఇక ఎట్టకేలకు విడుదల సిద్దమవుతుంది.రీసెంట్ గా రిలీజైన సాంగ్స్ , ట్రైలర్ కుసూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ అయితే అన్ని చార్ట్ బస్టర్ అయ్యాయి.సోషల్ మెసేజ్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుంది. రెండు రోజుల క్రితం ఏపీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు ఆంధ్రాలో స్పెషల్ షోస్ అలాగే టికెట్ రేట్ పెంపునకు అనుమతి లభించింది.రిలీజ్ రోజు 6షో లు.. బెనిఫిట్ షో కు 600 పెంచుకోవచ్చు.10వతేది నుండి 23వరకు 5షో లకు మల్టీ ఫ్లెక్స్ లో 175 ,సింగిల్ స్క్రీన్ 135 వరకు పెంచుకునేలా అనుమతినిచ్చింది. అయితే తెలంగాణ లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో టికెట్ హైక్ కు అలాగే స్పెషల్ షోస్ కు పర్మిషన్ లభిస్తుందా అనేది ఆసక్తిగా మారింది.చిత్ర నిర్మాత దిల్ రాజు అయితే తెలంగాణ ప్రభుత్వంకు టికెట్ రేట్ల గురించి దరఖాస్తు చేసుకుంటామని తెలిపారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో నటించగా కియరా అద్వానీ ,అంజలీ ,శ్రీకాంత్,ఎస్ జె సూర్య , సముద్రఖని , సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాకు తమన్ సంగీతంఅందిస్తున్నాడు. తెలుగుతోపాటు తమిళ ,హిందీ భాషల్లో గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: