ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సరికొత్త చరిత్ర సృష్టించింది ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇంతకుముందు వరకు బాహుబలి 2 ఉండేది.ఇప్పుడు ఆ రికార్డు ను బ్రేక్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది పుష్ప2.32 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1831 కోట్ల వసూళ్లను రాబట్టిందని మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు.ఇక అటు నార్త్ లో పుష్ప 2 జోరు కొనసాగుతూనే వుంది.నిన్నటి తో ఈసినిమా హిందీలో 812కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పటికే అక్కడ హైయెస్ట్ గ్రాసర్ గా కొనసాగుతుండగా ఫుల్ రన్ లో 825కోట్ల మార్క్ ను చేరుకోనుంది.ఇప్పుడప్పుడే ఈ రికార్డు బీట్ చేయడం దాదాపు అసాధ్యమే. ఒక్క హిందీ వెర్షనే ఓవరాల్ గా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో కూడా ఈసినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంటుంది.తెలుగు రాష్ట్రాల్లో నిన్నటితో ఈసినిమా 220కోట్లకు పైగా షేర్ ను ఖాతాలో వేసుకుంది.అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.ఇక ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే ఈనెల చివర్లో స్ట్రీమింగ్ లోకి వచ్చే ఛాన్స్ వుంది. అన్ని భాషలకు గాను నెట్ ఫ్లిక్స్ పుష్ప 2 స్ట్రీమింగ్ హక్కులను తీసుకుంది.
పుష్పకు సీక్వెల్ గా వచ్చిన ఈసినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా రష్మిక మందన్న కథానాయికగా నటించింది.రావు రమేష్, జగపతి బాబు ,జగదీష్ కీలక పాత్రల్లో కనిపించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మించాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: