సంక్రాంతికి వస్తున్నాం.. డబ్బింగ్ పూర్తిచేసిన మీనాక్షి చౌదరి

Actress Meenakshi Chaudhary Completes Dubbing For Sankranthiki Vasthunam

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా ఈ చిత్రం నుంచి ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు’ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక రీసెంట్‌గా డిసెంబర్ 13న వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అలాగే తాజాగా సెకండ్ సింగిల్ ‘మీను’ సాంగ్‌ను కూడా రిలీజ్ చేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ అందింది. ఇందులో వన్ ఆఫ్ ది ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న మీనాక్షి చౌదరి తన పాత్రకి సంబంధించి డబ్బింగ్ పూర్తిచేసింది. కాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్ నాన్‌స్టాప్ ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా త్వరలోనే ‘సంక్రాంతి’ అనే మరో సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు.

అలాగే కొన్ని టీవీ షోలు మరియు టాక్ షోలను నిర్వహించనున్నారు. వీటితోపాటుగా మరికొన్ని రోజుల్లోనే మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. దీని తరువాత సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇలా వరుస ప్రోగ్రామ్‌లతో సినిమాను విడుదలకు ముందే భారీగా ప్రమోట్ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు మేకర్స్.

సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తుండగా.. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.