ఎఫ్ 2 &ఎఫ్ 3 తరువాత డైరెక్టర్ అనిల్ రావిపూడి, సీనియర్ హీరో వెంకటేష్ ,ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది.ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ముఖ్యంగా మొదటి సాంగ్ గోదారి గట్టు కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు.ఇంస్టా లో ఈపాటతో చాలా రీల్స్ వచ్చాయి. దీని తరువాత వచ్చిన సెకండ్ సాంగ్ మీను కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మూడో సాంగ్ కూడా రానుంది.ఈ సందర్భంగా సాంగ్ అనౌన్స్ మెంట్ వీడియో ను రిలీజ్ చేశారు. ఈసాంగ్ కు వెంకటేష్ వోకల్స్ అందించడం విశేషం. ఇంతకుముందు ఆయన, గురు సినిమాలో కూడా పాడారు.ఇక ఇప్పుడు ఇందులో కూడా వెంకీ పాటను విననున్నాం.సంక్రాంతికి వస్తున్నాంలోని రెండు పాటలు సూపర్ హిట్ అవ్వడంతో మూడో పాటపై అంచనాలు పెరిగిపోయాయి.
ఈసినిమాకు రోజు రోజుకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది.సినిమాలో కామెడీ వర్క్ అవుట్ అయితే సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బాస్టర్ కానుంది.ఆల్రెడీ బుక్ మై షో లో ఇంట్రెస్ట్ 150k దాటాయి. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తయింది.
ఇందులో ఐశ్వర్య రాజేష్,మీనాక్షిచౌదరి హీరోయిన్లుగా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.జనవరి 14న ఈసినిమా థియేటర్లోకి రానుంది.అయితే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ ,డాకు మహారాజ్ కూడా బరిలోకి దిగుతున్నాయి.దాంతో సారి పోటీ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























