ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాది – సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy Gives Key Advises To Telugu Film Industry

ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని.. అంతే తప్ప ఎలాంటి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని స్పష్టం చేసారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు తాజాగా టీఎఫ్‌డీసీ చైర్మన్, అగ్ర నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో టాలీవుడ్ ప్రముఖులు పలువురు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తనతో సమావేశమైన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా పరిశ్రమ ముఖ్యులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వెలిబుచ్చిన కీలక సలహాలు, సూచనలు..

  • సినిమా ప్రముఖులు పరిశ్రమ సమస్యలను మా దృష్టికి తెచ్ఛారు.
  • అనుమానాలు, అపోహలు, ఆలోచనలను పంచుకున్నారు.
  • 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చాం.
  • పుష్ప 2 ఈవెంట్‌కు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం.
  • తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
  • పరిశ్రమ బాగుండాలని కోరుకున్నాం.
  • ఐటీ, ఫార్మాతో పాటు మాకు సినిమా పరిశ్రమ కూడా ముఖ్యం.
  • తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశాం.
  • ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండానికి దిల్ రాజును టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించాం.
  • సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు.
  • పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.
  • తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్‌కు రెండు గంటలల్లో రావొచ్చు.
  • తెలంగాణలోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి.
  • ముంబయిలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది.
  • కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ.
  • హాలివుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు.
  • హైదరాబాద్‌లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం.
  • పరిశ్రమను నెక్ట్ప్ లెవల్‌కు తీసుకెళ్లడమే మా ఉద్దేశం.
  • యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం.
  • అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నాం.
  • 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చుకోలేకపోతుంది.
  • స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం.
  • గంజాయి, డ్రగ్స్‌తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి..
  • సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి.
  • ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం.
  • సినిమా పరిశ్రమను ప్రోత్సాహించడమే మా ముఖ్య ఉద్దేశం.
  • ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాది.
  • నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు.
  • తెలుగు పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అంతా కలిసి అభివృద్ధి చేద్దాం.
  • మా ప్రభుత్వం పరిశ్రమకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.