గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా విడుదలకు సిద్దమవుతుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.అందులో భాగంగా ఈరోజు యూఎస్ఏ లో ప్రీ రిలీజ్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.డల్లాస్ లో ఈరోజు సాయంత్రం 6గంటలకు ఈ ఈవెంట్ స్టార్ట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ ఫోర్త్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఈ సాంగ్ విడుదలకానుంది.దోప్ అంటూ రానున్న ఈసాంగ్ కు హైప్ మాములుగా లేదు. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ ప్రోమో అంచనాలు పెంచేసింది. దోప్ శంకర్ మార్క్ గ్రాండియర్ సాంగ్ గా రానుండగా ఇందులో రామ్ చరణ్ డ్యాన్స్ హైలైట్ అవ్వనుంది.తమన్ ఈ సాంగ్ కోసం అదిరిపోయే బీట్స్ ఇచ్చాడు.
ఇక ఈ సాంగ్ కు సంబంధించిన మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ దోప్ సాంగ్ కూడా పక్కా చార్ట్ బాస్టర్ అయ్యేలాగేఉంది.సోషల్ మెసేజ్ తో వస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో నటించగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.అంజలి ,ఎస్ జె సూర్య ,శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 10న గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: