పుష్ప 2 ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే

Pushpa 2 Makers Gives Clarity on OTT Streaming Date

‘పుష్ప-2’ ది రూల్‌ వైల్డ్‌ ఫైర్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌తో బాలీవుడ్‌లో ఐకాన్‌స్టార్‌ సరికొత్త చరిత్ర ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప-2’ ది రూల్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్ పతాకంపై నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ చిత్రం విడుదలకు ముందే పలు కొత్త రికార్డులను క్రియేట్‌ చేసిన ఈ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ మూవీ విడుదల తరువాత సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. విడుదలైన తొలిరోజే నుంచే అన్ని ఏరియాల్లో కలెక్షన్స్‌ విషయంలో ఆల్‌టైమ్‌ రికార్డులు నెలకొల్పుతున్న పుష్ప-2 ది రూల్‌ బాక్సాఫీస్‌ వద్ద తన హవా కొనసాగిస్తుంది. అత్యంత వేగంగా 14 రోజుల్లోనే రూ.1500 కోట్ల రూపాయాలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్‌చేసింది.

ఈ నేపథ్యంలో పుష్ప 2 ఓటీటీ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో మేకర్స్ ఈ వ్యవహారంపై స్పందించారు. దేశవ్యాప్తంగా పుష్ప 2 చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోందని, ఇప్పుడప్పుడే ఈ సినిమాను ఓటీటీ లోకి తీసుకురావడంలేదని తెలిపారు. రిలీజ్ నాటి నుంచి 56 రోజుల తర్వాతే ఈ మూవీ ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుందని స్పష్టం చేశారు. ఇక నిర్మాతల ప్రకటన ప్రకారం.. పుష్ప 2 ఓటీటీ లోకి వచ్చేది 56 రోజుల తర్వాతే. అంటే, రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది. సో మూవీ లవర్స్.. ఈ బ్లాక్ బస్టర్ ను ఓటీటీలో చూడాలంటే.. మరో నెల రోజులు వేచి చూడాల్సిందే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.