గేమ్ ఛేంజర్ కోసం అమెరికాకు రామ్ చరణ్

Ram Charan off to Dallas for Pre Release event

మరో 21రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇప్పటి వరకు విడుదలైన సాంగ్స్ , టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.వచ్చే వారం లో ట్రైలర్ ను వదిలే యోచనలో వున్నారు మేకర్స్.సినిమాపై బజ్ మరింత పెరిగేందుకు ట్రైలర్ కట్ కీలకం కానుంది. ఓవర్సీస్ లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ కాగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికా లోని డల్లాస్ లో జరుపనున్నారని తెలిసిందే.మొదటి సారి ఓవర్సీస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న సినిమాకూడా ఇదే.ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ నిన్న రాత్రి యూఎస్ఏ కు బయల్దేరి వెళ్లారు. చిత్ర బృందం కూడా ఈరోజు అక్కడికి చేరుకోనుంది.రేపు సాయంత్రం 6గంటలకు ఈ ఈవెంట్ స్టార్ట్ కానుంది.

ఈసినిమా విజయం పై అయితే టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. శంకర్ మార్క్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్, ఎస్ జె సూర్య , కిక్ శ్యామ్ ,అంజలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 10న థియేటర్లలోకి రానుంది.అయితే అంత కన్నా ఒక రోజు ముందుగానే ప్రీమియర్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ ఆల్రెడీ తన 16వ సినిమాను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది.బుచ్చి బాబు సన ఈసినిమాను తెరకెక్కిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ,జగపతి బాబు ,దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రి మూవీస్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.