1500కోట్ల క్లబ్ లో పుష్ప 2

pushpa 2 joins 1500cr club in 14 days

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 అరుదైన మైలు రాయిని చేరుకుంది.బుధవారంతో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లకుపైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం 14రోజుల్లోనే ఈ మార్క్ ను చేరుకోనుంది.దాంతో అతి వేగంగా ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమాగా పుష్ప 2 నిలిచింది.ఓవరాల్ గా చూస్తే 1500కోట్ల క్లబ్ లో చేరిన థర్డ్ ఇండియన్ మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది.ఇంతకుముందు దంగల్ ,బాహుబలి 2 ఈ మార్క్ ను క్రాస్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా రెండో వారంలోనూ సాలిడ్ హోల్డ్ తో సూపర్ వసూళ్లను రాబట్టి మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ ను కూడా చేరుకుంది.ముఖ్యంగా హిందీ లో డ్రీం రన్ ను కొనసాగిస్తుంది.15రోజుల్లో అక్కడ 632.50కోట్ల నెట్ వసూళ్లను సాధించి దేశ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను రాబట్టిన మొదటి హింద సినిమాగా ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. 

ఇంతకుముందు స్త్రీ 2 మొదటి స్థానంలో ఉండేది.ఓవరాల్ గా చూస్తే పుష్ప 2 హిందీ వెర్షన్ 1000కోట్ల వసూళ్ల దిశగా సాగుతుంది.ఇంతకుముందు జవాన్ ,పఠాన్ ఈ మార్క్ ను చేరుకోగా పుష్ప 2 ఫుల్ రన్ లో వీటిని క్రాస్ చేయనుంది.ఒక్క ముంబై సర్కిల్ లోనే 200కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది పుష్ప 2.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 300కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసింది.సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో లాంగ్ రన్ ను కొనసాగించనుంది.అటు ఓవర్సీస్ లో కూడా సూపర్ రన్ ను కొనసాగిస్తోంది.ఇప్పటివరకు 28 మిలియన్లకు పైగా వసూళ్లను సాధించి కెజియఫ్ 2 లైఫ్ టైం కలెక్షన్స్ ను క్రాస్ చేసింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.