NKR 21లో బాలీవుడ్ నటుడు 

bollywood actor Sohail Khan on board for NKR 21

డెవిల్ తరువాత హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాలో నటిస్తున్నాడు.ప్రదీప్ చిలుకూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రముఖ నటి విజయశాంతి ఇందులో కీలక పాత్రలో కనిపించనుంది.సరిలేరు నీకెవ్వరు తరువాత ఆమె చేస్తున్న సినిమా ఇదే.ఇక ఈసినిమాలో పవర్ ఫుల్ రోల్ కోసం బాలీవుడ్ నటుడు సోహాల్ ఖాన్ ను తీసుకున్నారు.స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అయిన సోహైల్ హిందీలో పలు సినిమాలు చేశాడు.ఇక ఇప్పుడు ఈసినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.ఈరోజు తన బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి విషెస్ చెప్పింది టీం. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.ఇందులో కళ్యాణ్ రామ్ పాల్గొంటున్నాడు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, యానిమల్ పృథ్వీ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.అశోక క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా,సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలోకి రానుంది. 

త్వరలోనే ఈసినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు.కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.మరి ఈసినిమా తనకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.