ఎఫ్ 2 తో ఫ్యామిలీ ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.ఈసినిమా తరువాత తను చేసిన అన్ని సినిమాలకు ఈవర్గం ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక అనిల్ రావిపూడి ఈసారి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రావడానికి రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం ఈ డైరెక్టర్ ,సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం తెరకెక్కిస్తున్నాడు.ఈ సంక్రాంతికి వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ చార్ట్ బాస్టర్ కాగా నిన్న రెండో పాటను విడుదల చేశారు.మీను అంటూ వచ్చిన ఈసాంగ్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.దాంతో పాటలతోనే ఈసినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది.సినిమాలో కామెడీ కూడా వర్క్ అవుట్ అయితే ఈ సంక్రాంతికి వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం మరో ఎఫ్ 2 కానుంది.బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ కూడా 150K దాటాయి.
ఇందులో ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.జనవరి 14న ఈసినిమా థియేటర్లోకి రానుంది.అయితే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ ,డాకు మహారాజ్ కూడా బరిలోకి దిగుతున్నాయి.దాంతో ఈమూడు సినిమాల మధ్య ఆసక్తికర పోటీ ఉండనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























