హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సహా ఇతర ప్రచార చిత్రాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి ‘మా ఊరి జాతరలో’, ‘అదే నేను.. అసలు లేను’, ‘మరీ అంత కోపం’ అనే పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. నేచురల్ స్టార్ నాని చేతులమీదుగా ఈ ట్రైలర్ లాంచ్ జరిగింది. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింతగా పెంచేలావుంది. అల్లరి నరేష్ మరోసారి లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్‌లో నటించారు. పోలీస్ ఆఫీసర్ అయిన రావు రమేష్ అల్లరి నరేష్ క్యారక్టర్ గురించి వివరించడంతో ట్రైలర్ ప్రారంభమయింది.
హీరోయిన్ పరిచయం, దురలవాట్లను వదులుకోవాలని ఆమె కోరడం.. చివరికి ఆమె కోసం తన దురలవాట్లను వదులుకోవడం వంటి సన్నివేశాలు గమనిస్తే, తనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడనేది అర్ధమవుతోంది. మధ్యమధ్యలో మదర్ సెంటిమెంట్ మెప్పించింది. అలాగే చివరిలో బచ్చల మల్లి జీవితంలో ఏదో ఒక పెద్ద సంఘటన జరిగినట్టు ఇంటెన్స్ తో కూడిన ట్విస్ట్ ను చూపించీచూపించకుండా ముగించారు.
1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా పాయింట్‌తో తెరకెక్కుతోన్న బచ్చల మల్లి చిత్రంలో అల్లరి నరేష్ ఫుల్ మాస్ రోల్‌లో కనిపిస్తుండగా.. ‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే రావు రమేష్, రోహిణి, సాయికుమార్, కోట జయరామ్, హరితేజ, ప్రవీణ్, ధనరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ‘మానాడు’, ‘రంగం’, ‘మట్టి కుస్తీ’ వంటి హిట్ సినిమాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్‌గా పని చేస్తున్నారు. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్‌గా సహకారం అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























