మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలకు ఇంకా కొన్ని రోజులే ఉన్నక్రమంలో గేమ్ ఛేంజర్ రిలీజ్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ‘జరగండి, రా మచ్చా, నానా హైరానా’ అనే మూడు లిరికల్ సాంగ్స్‌ను విడుదల చేయగా, అవి మ్యూజిక్ లవర్స్‌ని బాగా ఇంప్రెస్ చేశాయి.
దీంతో మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. గేమ్‌ఛేంజర్ సినిమా కేరళ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను E4 ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పొందింది. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గేమ్ ఛేంజర్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది.
మరోవైపు రీసెంట్‌గా గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. అలాగే జనవరి 9న ఈ సినిమా ప్రీమియర్స్ ప్రపంచవ్యాప్తంగా స్క్రీనింగ్ చేయనున్నారు. మూవీపై భారీ అంచనాలున్న క్రమంలో గేమ్ ఛేంజర్‌కి సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. ఇక త్వరలోనే అమెరికాలోని డల్లాస్‌లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుండగా.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ హాజరుకానున్నారు.
ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. అలాగే మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: