కొత్త సినిమా అనౌన్స్ చేసిన చియాన్ విక్రమ్

National Award Winning Hero Chiyaan Vikram's 63rd Movie Announced

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, వెర్సటైల్ హీరో చియాన్ విక్రమ్, మండేలా, మావీరన్ (తెలుగులో మహావీరుడు)చిత్రాలతో ప్రశంసలు అందుకునన్న క్రియేటివ్ డైరెక్టర్ మడోన్ అశ్విన్‌తో కొలాబరేట్ అవుతున్నారు. ఈ చిత్రానికి #Chiyaan63 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. శాంతి టాకీస్‌ ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మాత అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ అశ్విన్ క్రియేటివిటీ, విక్రమ్ పవర్‌హౌస్ పెర్ఫార్మెన్స్ బ్లెండ్ చేసి మరపురాని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనుంది. మడోన్ అశ్విన్ విక్రమ్‌కు సరిపోయే సబ్జెక్ట్ తో సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. ఇక ఈ చిత్రం త్వరలో ప్రారంభమవనుంది. ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

ఈ సందర్భంగా నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ.. “దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన చియాన్ విక్రమ్ సర్‌తో కలిసి మా ప్రొడక్షన్ నంబర్ 3ని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా వుంది. అతని ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. మనకు ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలు, సంచలనాత్మక చిత్రాలను అందించిన నటుడితో చేతులు కలపడం మాకు గౌరవం” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఈ చిత్రానికి మండేలా, మావీరన్‌లను అందించిన అత్యుత్తమ డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రొడక్షన్ హౌస్‌గా, మేము రెండవసారి మడోన్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. మేమంతా కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే చిత్రాన్ని అందించబోతున్నాం” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.