టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తన అరెస్ట్ వ్యవహారంపై స్పందించిన ఆయన, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పారు. శుక్రవారం ఆయనను పోలీసులు చంచల్‌గుడా జైలుకు తరలించగా.. హైకోర్ట్ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయడంతో శనివారం ఉదయం జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ రోజు అక్కడ జరిగిన ఘటన గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మహిళ రేవతి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ మహిళ మృతి చెందడం దురదృష్టకరం అన్న అల్లు అర్జున్, ఈ లోటు పూడ్చలేనిదని చెప్పారు.
ఎన్నోసార్లు వెళ్ళా..
“గత 20 ఏళ్లుగా అదే థియేటర్‌కు వెళ్తున్నా.. దాదాపు 30 సార్లు అక్కడ సినిమాలు చూశాను. కానీ ఎప్పుడూ ఇలాంటిది జరగలేదు. నేను సినిమా చూసేందుకు లోపలకి వెళ్లినప్పుడు అనుకోకుండా ఈ ఘటన జరిగింది. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ట్రీట్‌మెంట్ పొందుతున్న రేవతి కుమారుడిని, బాధిత కుటుంబాన్ని త్వరలోనే వెళ్లి కలుస్తా. ఆ ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటాను. దేశవ్యాప్తంగా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అలాగే మీడియాతో పాటు నా అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు అల్లు అర్జున్.
ఇక అల్లు అర్జున్ తో పాటు ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడారు. నిన్న అర్జున్ అరెస్ట్ దగ్గరనుంచీ, నేడు అతను విడుదలై ఇంటికి వచ్చేవరకూ ప్రతి మూమెంట్ కవర్ చేస్తూ ప్రజలకు చేరవేసినందుకు లోకల్ మీడియా సహా నేషనల్ మీడియా ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: