మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ “కార్నేజ్” టీజర్‌ను లాంచ్ చేశారు. కార్నేజ్ వీడియో సాయి దుర్గ తేజ్ విధ్వంసక, ఇంటెన్స్ క్యారెక్టర్ కు స్నీక్ పీక్ అందిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్న కార్నేజ్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. కాగా ఈ చిత్రానికి SYG (సంబరాల ఏటిగట్టు) అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ ని కార్నేజ్ వీడియో ద్వారా రివీల్ చేశారు.
ఈ సందర్భంగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ అందరి ప్రేమను పొందే అదృష్టం నాకు దక్కింది. మన చరణ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. లవ్ యు చరణ్” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నాకోసం వచ్చిన డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్స్ కి అందరికీ థాంక్యూ సో మచ్. మెగా ఫ్యాన్స్ కి థాంక్యూ సో మచ్. మీ ప్రేమ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈ సందర్భంగా అందరూ ఒక ప్రతిజ్ఞ చేయాలి. బైక్ నడిపినప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. నేను హెల్మెట్ ధరిస్తాను. మీరు హెల్మెట్ ధరించాలి. థాంక్యూ సో మచ్. లవ్ యు ఆల్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: