పుష్ప 2 సక్సెస్‌ క్రెడిట్ పూర్తిగా సుకుమార్‌దే – అల్లు అర్జున్‌

Pushpa 2 Thank You India Meet Icon Star Allu Arjun Praises Director Sukumar

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. తాజాగా ఆరు రోజుల్లో రూ.1000 కోట్లు వసూలు ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతంగా రూ. 1000 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజాగా ఈ చిత్రం థాంక్యూ ఇండియా ప్రెస్‌మీట్‌ గురువారం ఢీల్లీలో జరిగింది. ఈ ప్రెస్‌మీట్‌లో నిర్మాత నవీన్‌ ఎర్నేని, ఇతర పంపిణీదారులు, థియేటర్‌ యజమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. ఐకాన్ స్టార్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..”ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్న దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్‌. ఆయన విజన్‌, ఆయన కష్టానికి ప్రతిఫలం ఈ చిత్రం. ఇక ఈ చిత్రం రూ.1000 కోట్లు కలెక్ట్‌ చేయడం, భవిష్యత్‌లో మరింత వసూళ్లు సాధించడం ఒకెత్తు అయితే నెంబర్స్‌ అనేవి వాళ్ల ప్రేమకు నిదర్శనం.”

“అయితే ఈ నెంబర్స్‌ టెంపరరీ. ఎందుకంటే భవిష్యత్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా ఈ నెంబర్స్‌ను క్రాస్‌ చేస్తుంది. కానీ ఆడియన్స్‌ ఇచ్చే లవ్‌ మాత్రం శాశ్వతం. వాళ్లు నా పై చూపిస్తున్న వైల్డ్‌ ప్రేమకు జీవితాంతం బుణపడి ఉంటాను’ అన్నారు. నిర్మాత రవిశంకర్‌ మాట్లాడుతూ ” అల్లు అర్జున్‌ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల కోసం 32 రోజులు రోప్‌ ధరించి ఉండేవాడు. ఫిజియో థెరపిస్ట్‌ కూడా లోకేషన్స్‌లో ఉండేవాడు. ఈ రోజు ఆయన హార్డ్‌ వర్క్‌కు తగిన ప్రతిఫలం లభిస్తుంది’ అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.