ఇది నా విక్టరీ కాదు, ఇండియా విక్టరీ – అల్లు అర్జున్‌

Icon Star Allu Arjun Says, Pushpa 2 Success is India's Victory

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌.. ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. తాజాగా ఆరు రోజుల్లో రూ.1000 కోట్లు వసూలు ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ. 1000 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.

తాజాగా ఈ చిత్రం థాంక్యూ ఇండియా ప్రెస్‌మీట్‌ గురువారం ఢీల్లీలో జరిగింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ”నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న భారతీయులందరికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు నా థాంక్స్‌. భారతీయులందరూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. గ్లోబల్‌గా ఉన్న సినీ ప్రేమికులందరూ ఇండియా సినిమాను ఇంతగా ఆదరిస్తున్నందుకు వారికి నా ప్రత్యే క ధన్యవాదాలు. ఇది నా విక్టరీ కాదు. ఇండియా విక్టరీ.” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఒక సినిమాను అన్ని రాష్ట్రాల ప్రజలు సెలబ్రేట్‌ చేశాయి. ఇదే నా దేశం గొప్పతనం. ఇక ఈ సినిమాను ఆదరిస్తున్న అన్నిరాష్ట్రాల సినీ పరిశ్రమలకు, అక్కడికి సినీ ప్రముఖులకు, ప్రభుత్వాలకు, పోలీసులకు, మీడియా వాళ్లకు నా థాంక్స్‌. ముఖ్యంగా పుష్ప 2 సినిమాను మరింత ప్రేమతో, అత్యధిక వసూళ్లతో ఆదరిస్తున్న హిందీ సినీ ప్రేక్షకులకు నా మనస్పూర్తిగా థాంక్స్‌” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.