మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ “కార్నేజ్” టీజర్‌ను లాంచ్ చేశారు. కార్నేజ్ వీడియో సాయి దుర్గ తేజ్ విధ్వంసక, ఇంటెన్స్ క్యారెక్టర్ కు స్నీక్ పీక్ అందిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్న కార్నేజ్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. కాగా ఈ చిత్రానికి SYG (సంబరాల ఏటిగట్టు) అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ ని కార్నేజ్ వీడియో ద్వారా రివీల్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “తేజు నా కెరీర్లో ఫేవరెట్ ఫిలిం ‘ప్రతిరోజు పండగే’ ఇచ్చాడు. మెగా ఫ్యాన్స్ అందరినీ ఇక్కడ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప సినిమా నిర్మించడానికి పూనుకున్న నిర్మాతలకు, డైరెక్టర్ రోహిత్ గారికి ఆల్ ది బెస్ట్. విజువల్స్ చాలా బాగున్నాయి. టైటిల్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్” అని అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “తేజు జర్నీ మొత్తం నాకు తెలుసు. తేజుతో సుప్రీం అనే బ్యూటిఫుల్ సినిమా చేశాను. తనది కొండంత ప్రేమ. తను మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. తనకి మంచి స్క్రిప్ట్ పెడితే అవుట్ ఆఫ్ ద పార్క్. ఈ టైటిల్ టీజర్ చూశాను. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. నిర్మాతలకు బెస్ట్ విషెస్. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన రామ్ చరణ్ గారికి స్పెషల్ థాంక్స్ చెప్తున్నాను. సంక్రాంతికి గేమ్ చెంజర్ తో ఆయనకి మెగా బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “నేను ఏ కథ రాసుకున్నా ఫస్ట్ ఊహించుకునే హీరో సాయి తేజ్. తను ఏ క్యారెక్టర్ లో కూడా ఫిట్ అవ్వగలరు. ఈ పదేళ్ల జర్నీలో ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక మేజర్ ఇన్సిడెంట్ నుంచి కం బ్యాక్ అయ్యారు. ఈ సినిమాలో ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. హనుమాన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఈ సినిమా అంతకంటే పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. “సాయి తేజ్ ని హీరోగా పరిచయం చేసే అవకాశం నాకు వచ్చింది. తేజ్ లో చిలిపి తనం, వినయం రెండు షేడ్స్ వుంటాయి. హీరో ఎందుకు అవ్వాలని అడిగితే.. జీవితంలోని అన్ని పాత్రలని నటుడిగా పోషించవచ్చు కదాని చెప్పారు. ఆ సమాధానం విని షాక్ అయ్యాను. తను చాలా కష్టపడ్డాడు. తన పదేళ్ళ జర్నీ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. తనతో మళ్ళీ ఓ విజయవంతమైన సినిమా తీయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. తేజ్ చాలా క్యాలిబర్ వున్న యాక్టర్. రిపబ్లిక్ సినిమా ఐడియా చెప్పినపుడు తప్పకుండా చెస్తానని ముందుకు వచ్చారు. క్లైమాక్స్ మారిస్తే కమర్షియల్ గా వర్క్ అవుతుందని చాలా మంది చెప్పారు. కానీ తేజ్ దానికి అంగీకరీంచలేదు. క్లైమాక్స్ మారిస్తే అది నా సినిమా కాదు అన్నారు. అంత జెన్యూన్ యాక్టర్ తను. తను చాలా గ్రేట్ హీరో” అని అన్నారు.
ఇక చివరిగా దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. “చిత్రలహరి సినిమా సమయంలో నా వర్క్ ని అభినందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఫ్లవర్ బోకే సెండ్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను, నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి తేజ్ నా స్నేహితుడు. ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చారు. తను ఇలాగే గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: