బాలకృష్ణ -డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ సినిమా నుండి రేపు మొదటి పాట రిలీజ్ కానుందని తెలిసిందే.అయితే అంత కన్నా ముందు ఈరోజు ఈ సాంగ్ ప్రోమో ను వదిలారు.ఇక ఈ ప్రోమో సాంగ్ మీద అంచనాలు పెంచేసింది.పవర్ ఫుల్ లిరిక్స్ కి తోడు తమన్అ ద్భుతమైన ట్యూన్స్ సాంగ్ కి రిపీట్ వాల్యూ ఇవ్వనున్నాయని టాక్.అనంత్ శ్రీరామ్ ఈ పాటను రచించగా ఆకాష్ నజీజ్ వోకల్స్ అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రద్దా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ ,చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ , ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.సంక్రాంతికి కానుకగా జనవరి 12న డాకు మహారాజ్ విడుదలకానుంది.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 చేస్తున్నాడు.బ్లాక్ బాస్టర్ మూవీ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.బోయపాటి శ్రీను ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.14రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న అఖండ 2 థియేటర్లలోకి రానుంది.సో ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదలచేయలేకయినా బాలకృష్ణ వచ్చే ఏడాది 2 సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుషి చేయనున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: