మా మగధీరుడి రాబోయే సినిమా సక్సెస్ అవ్వాలి – అల్లు అరవింద్

Producer Allu Arvind Wishes To Ram Charan's Game Changer A Big Success

మా మగధీరుడి రాబోయే సినిమా సక్సెస్ అవ్వాలి అని అభిలషించారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఈ మేరకు ఆయన తాజాగా తన మేనల్లుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా ‘సంబరాల ఏటిగట్టు’ టైటిల్ లాంచ్ ఈవెంట్ దీనికి వేదికైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గురువారం రీసెంట్‌గా జరిగిన ఈ వేడుకలో రామ్ చరణ్ కార్నేజ్ టీజర్‌ను లాంచ్ చేశారు. ‘హనుమాన్’ వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా ఇందులో తేజ్ కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు.

ఇక ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “ఇక్కడికి విచ్చేసిన మెగా అభిమానులందరికీ నా అభినందనలు. ఈ సినిమాలో విజువల్స్ చూస్తుంటే నిజంగా తేజు ఈ బాడీని ఎప్పుడు పెంచాడని ఆశ్చర్యకరంగా ఉంది. విజువల్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. డైరెక్టర్ గారికి, నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి కంగ్రాజులేషన్స్. తేజు ఇండస్ట్రీకి వచ్చి టెన్ ఇయర్స్ అయ్యింది అంటే నమ్మశక్యంగా లేదు. తను మొన్న మొన్న వచ్చినట్లే అనిపిస్తుంది” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మా విజయ అదృష్టవంతురాలు. తన పేరును కూడా తీసుకెళ్లి తేజు పేరులో పెట్టుకున్నాడు. అలాంటి కొడుకు దొరకడం అదృష్టం. తేజు ఒక మృత్యుంజయుడు. తనకి కలకాలం విజయాలు వరిస్తూ ఇలా అద్భుతంగా ముందుకు వెళ్లాలని, ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మగధీరుడు రామ్ చరణ్ రాబోయే సినిమా కూడా విజయవంతం కావాలని, సాయి తేజ్‌కి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.