ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 నార్త్ లో హవా కొనసాగిస్తోంది.వీకెండ్ లో ఆల్ టైం రికార్డు లను పెట్టిన ఈసినిమా వీక్ డేస్ లోనూ అదరగొడుతుంది.ఏడవ రోజు ఈసినిమా 31.50కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది.దాంతో వారం రోజుల్లో హిందీలో 406.50 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.అంతేకాదు అతి తక్కువ రోజుల్లో ఈ మైలురాయిని చేరుకున్న మొదటి సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రేపటి తో ఈసినిమా కెజియఫ్ 2 లైఫ్ టైం హిందీ కలెక్షన్స్ ను దాటేయనుంది.ఆ తరువాత ఆల్ టైం రికార్డు గా వున్న బాహుబలి 2 ని కూడా క్రాస్ చేయనుంది.ప్రస్తుతం 511 కోట్ల నెట్ వసూళ్లతో బాహుబలి 2, 435 కోట్ల తో కెజిఎఫ్ 2 హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాలుగా మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఈ వీకెండ్ లో బాహుబలి 2 రికార్డు కూడా బ్రేక్ చేయనుంది పుష్ప 2.ఫుల్ రన్ లో ఈసినిమా అక్కడ 600కోట్ల పైనే వసూళ్లను అందుకోనుంది.
ఇక అటు తెలుగులో ,తమిళం లోనూ జోరు కొనసాగిస్తోంది.నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 1000 కోట్ల మార్క్ ను దాటేసింది. దాంతో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ ,కల్కి 2898ఏడి తరువాత 1000కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన నాలుగో తెలుగు సినిమాగా పుష్ప 2 నిలిచింది.ఓవరాల్ గా చూస్తే ఈఫీట్ సాధించిన 8వ ఇండియన్ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది.అయితే మరో వారం వరకు ఇదే జోరు కొనసాగిస్తేనే బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోనుంది.అటు ఓవర్సీస్ లోనూ స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తోంది. నిన్నటి వరకు అక్కడ 20మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది.ఇప్పట్లో పెద్ద సినిమాల రిలీజ్ కూడా లేకపోవడం పుష్ప 2 కు అడ్వాంటేజ్ కానుంది.
సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో గా రష్మిక మందన్న కథానాయికగా నటించగా రావు రమేష్, జగపతి బాబు ,జగదీష్ కీలక పాత్రల్లో కనిపించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: