టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ మెయిన్ లీడ్‌గా నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘బచ్చల మల్లి’. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్ కాన్సెప్ట్ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి ‘మా ఊరి జాతరలో’ మరియు ‘అదే నేను.. అసలు లేను’ అనే పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా బచ్చల మల్లి నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘మరీ అంత కోపం’ అంటూ సాగే ఈ పాటకు పూర్ణా చారి సాహిత్యం సమకూర్చగా.. గాయకుడు సాయి విఘ్నేష్ హృద్యంగా ఆలపించారు. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన బాణీలు అందించారు. తొలి రెండు పాటల వలే ఇది కూడా మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేయడం గ్యారెంటీ.
‘బచ్చల మల్లి’ చిత్రం 1990 బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామా పాయింట్‌తో తెరకెక్కుతోంది. ముఖ్యంగా అల్లరి నరేష్ ఫుల్ మాస్ రోల్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమాలో ‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. రావు రమేష్, రోహిణి, సాయికుమార్, కోట జయరామ్, హరితేజ, ప్రవీణ్, ధనరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ‘మానాడు’, ‘రంగం’, ‘మట్టి కుస్తీ’ వంటి హిట్ సినిమాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ కెమరామెన్‌గా పని చేస్తున్నారు. దర్శకుడు సుబ్బు స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా, విప్పర్తి మధు స్క్రీన్ ప్లే రైటర్‌గా సహకారం అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: