తనపై వస్తోన్న ఫేక్ న్యూస్ మరియు రూమర్‌లను తీవ్రంగా ఖండించింది రీసెంట్ హిట్ ‘అమరన్’ నటి సాయి పల్లవి. వీటిని వ్యాపింపచేస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కాగా ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ మూవీ ‘రామాయణ్’లో సీతగా నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్రకోసం ఆమె పూర్తి శాకాహారిగా మారిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా సాయి పల్లవి దీనిపై హెచ్చరిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో.. “చాలా సార్లు, దాదాపు ప్రతిసారీ, నేను నిరాధారమైన పుకార్లు/ కల్పిత అబద్ధాలు/ తప్పుడు ప్రకటనలు ఉద్దేశ్యంతో లేదా లేకుండా వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండటాన్ని ఎంచుకుంటాను. ఎందుకంటే నిజం ఏంటనేది దేవుడికి తెలుసు కనుక. కానీ ఇది పదేపదే జరుగుతున్నందున నేను ప్రతిస్పందించాల్సిన సమయం ఆసన్నమైంది” అని తెలిపారు.
ఇంకా ఆమె ఇలా చెప్పారు.. “అందుకే ఇప్పుడు మాట్లాడాల్సివస్తోంది. ఇకపై ఇలాంటివాటిని సహించను. ప్రత్యేకించి నా సినిమాల విడుదలలు/ప్రకటనలు/ నా కెరీర్‌లో సంతోషించదగిన క్షణాల సమయంలో! తదుపరిసారి నేను ఏదైనా ప్రఖ్యాతి పొందిన వెబ్ పేజీని లేదా మీడియా/వ్యక్తిని వార్తలు లేదా గాసిప్‌ల పేరుతో ఒక చెత్త కథనాన్ని ప్రచురిస్తే మీరు నా నుండి చట్ట పరమైన చర్యలు ఎదుర్కోవాల్సివుంటుంది.” అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇక సాయి పల్లవి మరోవైపు యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ విడుదలైన తర్వాత మూవీపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7న తండేల్ సినిమా గ్రాండ్‌గా విడుదలవుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: